అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సత్తా చాటారు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఈ పోరులో గుజరాత్ ఓపెనర్లతో మొదలుకొని టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విజృంభించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ 48 పరుగులు, శుభ్‌మన్ గిల్ 76 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వారికి తోడుగా జాస్ బట్లర్ 64 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 15 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలంటే 225 పరుగులు చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, పాట్ కమ్మిన్స్ మరియు జీషన్ అన్సారీ ఒక్కో వికెట్ తీశారు. శుభ్‌మన్ గిల్‌ను హర్షల్ పటేల్ రన్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది.