మన ఇంట్లో ఎన్ని గదులు వున్నా అందరు ముందు చూసే గది ముఖ్యంగా మహిళలు చూసే గది ఏదయినా వుంది అంటే అది వంట గది (కిచన్) మాత్రమే, అది ఆ ఇంటి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మూలస్థానం. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉండే సానుకూల శక్తి కుటుంబ సభ్యుల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అయితే తెలియక మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు, కిచెన్‌లో ఉంచే కొన్ని వస్తువులు తెలియక పెడుతూ వుంటాము. అవి ఆర్థిక నష్టాలకు, అనారోగ్యాలకు దారితీయవచ్చు. మీ వంటగదిలో ఉండకూడని ఆ వస్తువులేంటో, వాటి వల్ల కలిగే నష్టాలేంటో సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం..
వంటగదిలో ఎప్పుడూ ఉండకూడని వస్తువులలో మొదటివి పగిలిన వస్తువులు,అవి పింగాణీ పాత్రలు లేదా అద్దాలు. వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని (Negative Energy) పెంచుతాయి ఇది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కారణమవుతుంది.
అలాగే, వంటగదిలో మందులు ఉంచడం అస్సలు మంచిది కాదు. వంటగది ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదేశం అక్కడ మందులు ఉంచితే ఆ ఇంట్లో వారు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తారు. వీటితో పాటు పనికిరాని పాత సామాన్లు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను కిచెన్‌లో నిల్వ చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కాస్త దెబ్బతుంటుంది.

కిచెన్ సింక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మహిళలు ఇంట్లో పరిస్థితి వల్ల లేక కుదరకో సింక్ లో పత్రాలు అలానే వుంచుతారు. సింక్ ఎప్పుడూ మురికి పాత్రలతో నిండి ఉండకూడదు, ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలు వదిలేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని అంటారు. పొయ్యి (Stove) మరియు సింక్ (నీరు) పక్కపక్కనే ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే నిప్పు మరియు నీరు విరుద్ధ శక్తులు కాబట్టి ఇవి దగ్గరగా ఉంటే ఇంట్లో అశాంతి నెలకొంటుంది.
కిచెన్‌లో చీపుర్లు ఉంచడం కూడా దరిద్రానికి సంకేతం. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురు వచ్చేలా ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లి విరుస్తాయి. ఇక వెంటనే మీ కిచెన్‌ను ఒకసారి పరిశీలించి, ఈ మార్పులు చేసుకోండి.
గమనిక: వాస్తు అనేది నమ్మకం మరియు జీవనశైలికి సంబంధించిన విషయం. ఈ మార్పులు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ పెరుగుతాయి. స్థల పరిమితుల వల్ల కొన్ని మార్పులు సాధ్యం కానప్పుడు నిపుణుల సలహాతో చిన్న చిన్న రెమెడీస్ పాటించడం ఉత్తమం.
