నిద్రలోనే సెక్స్‌ చేస్తున్నట్లు అనిపిస్తుందా..? ఇది ఓ అరుదైన వ్యాధి..

-

చాలామందికి నిద్రలో నడవడం, లేచి కుర్చోడం, మాట్లాడటం ఇలాంటి సమస్యలు ఉంటాయి.. కానీ నిద్రలో సెక్స్‌ చేయడం గురించి మీకు తెలుసా..? నిద్రలో సెక్స్‌ చేస్తున్నట్లు.. స్పష్టంగా ఎవరో మిమ్మల్ని తాకినట్లు.. హైలెట్‌ ఏంటంటే. మీరు కూడా ఆ టచ్‌ను ఫీల్‌ అవుతారు.. నిజంగానే రొమాన్స్‌ చేస్తున్నట్లు ఫీల్‌ అవుతారు.. వెంటనే భయమేసి లేస్తారు.. కొన్నిసార్లు.. వాళ్లకు నిద్రలేవగానే ఏం తెలియదు.ఉదయం లేస్తే.. ఏం జరగనట్టుగానే ప్రవర్తిస్తారు. సెక్స్‌సోమ్నియా.. దీనినే స్లీప్ సెక్స్(Sleep Sex) అని కూడా అంటుంటారు. ఇది ఒక రకమైన నిద్ర రుగ్మత. సెక్స్‌స్నోమియా(Sexsomnia) అనే రుగ్మత వచ్చిన వారు నిద్రలో సెక్స్ చేస్తారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
అమెరికాలో ఆ మధ్య ఓ మహిళ తన భర్తకు ఓ అరుదైన వ్యాధి ఉందని తెలిపింది.. ‘నేను రాత్రి త్వరగా నిద్రపోతాను. అయితే నా భర్త నిద్రిస్తున్నప్పుడు లైంగిక సంబంధం కలిగి ఉంటాడు. మరుసటి రోజు ఉదయం, సంఘటన గురించి అడిగినప్పుడు మర్చిపోతాడు.’ అని మహిళ చెప్పింది. వైద్య పరిభాషలో ఈ రుగ్మతను ‘సెక్స్‌సోమ్నియా’ అంటారు. ఈ వ్యాధితో బాధపడేవారు నిద్రిస్తున్నప్పుడు సంభోగం చేశారనే విషయాన్ని మరచిపోతారు. చాలా మంది ఈ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ముందుగా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలు ఉన్న వ్యక్తిలో సెక్స్‌సోమ్నియా సంభవించవచ్చు. మగవారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందట.. పూర్తిగా మేల్కొని ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, లైంగిక నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు నిద్రలో ఉన్నప్పుడు వారు చేసిన లైంగిక ప్రవర్తనలను గుర్తుంచుకోరు. కొంతమందికి ఇది తొలి దశలో తెలుస్తుంది. వెంటనే నిద్రలేస్తారు.

సెక్స్‌సోమ్నియా లక్షణాలు:

హస్తప్రయోగం, రమ్మని పిలవడం, సంభోగం, లైంగిక వేధింపు, శబ్ధాలు చేయడం, నిద్రపోతున్నప్పుడు చెడుగా మాట్లాడటం.

కారణాలు

ఒత్తిడి, నిద్ర లేమి, మద్యం లేదా ఇతర ఔషధాల వినియోగం. ముందుగా ఉన్న పారాసోమ్నియా ప్రవర్తనలు, కోపం, గందరగోళం, నిరాశ

ఈ వ్యాధికి చికిత్స..

ఈ వ్యాధిని నయం చేసే ఔషధం లేదని మానసిక నిపుణులు అంటున్నారు. ఇదంతా మానసికంగా మనం చేసే ఆలోచన మీదే ఆధారపడుతుంది. ఇది జరిగేప్పుడు భాగస్వామి ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. నిద్రలోనే శృంగారం చేసేప్పుడు ఆ వ్యక్తిని మేల్కొలపాలి. అవసరమైతే, సెక్స్‌లో పాల్గొనకుండా మాట్లాడండి. మనసిక నిపుణులు కూడా ఇదే అంటున్నారు. మీ భాగస్వామితో మొత్తం విషయాన్ని బహిరంగంగా చర్చించండి. సమస్య నయం అయ్యే ఛాన్స్ ఉంది. సెక్స్‌సోమ్నియా ఉండే వ్యక్తులకు మంచి వాతావరణాన్ని సృష్టించండి. సెక్స్‌సోమ్నియా డిజార్డర్ ఉన్న వ్యక్తులు నిద్రలోనే లైంగిక చర్యకు ఉపక్రమిస్తారని థెరపిస్టులు చెబుతున్నారు. వారి మానసిక స్థితిని మెరుగు పరిచే ప్రయత్నం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news