పాక్ రేంజర్‌ను పట్టుకున్నారు బీఎస్‌ఎఫ్ జవాన్లు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ బోర్డర్‌లో కలకలం చోటు చేసుకుంది. భారత సరిహద్దులోకి చొరబడిన పాక్ రేంజర్‌ను పట్టుకున్నారు జవాన్లు.

ఇక అటు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దచిగామ్, కుల్గామ్, షోపియాన్, అనంత్‌నాగ్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్ సాయంతో ఉగ్ర వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. ఈ తరుణంలోనే రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ బోర్డర్‌లో కలకలం చోటు చేసుకుంది. భారత సరిహద్దులోకి చొరబడిన పాక్ రేంజర్‌ను పట్టుకున్నారు జవాన్లు.