హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మే రెండవ వారం నుంచి… మెట్రో ఛార్జీలు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చార్జీల పెంపు ద్వారా వార్షికంగా అదనంగా 150 కోట్ల వరకు రాబట్టుకునేలా మెట్రో సంస్థ కసరత్తులు చేస్తున్నట్లు… వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మెట్రో సంస్థలో కనిష్టం టికెట్ ధర పది రూపాయలు ఉంది. గరిష్టంగా 60 రూపాయల టికెట్ ధర ఉంది. అయితే ఈ గరిష్ట టికెట్ ధర 75 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అటు పది రూపాయల టికెట్ 25 రూపాయలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ చార్జీల పెంపు మే రెండవ వారం అంటే మరో పది వారం పది రోజుల్లోనే అమలులోకి వస్తుందని చెబుతున్నారు. దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.