ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడలో వర్షప్రభావం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో నీరు ఇంటి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.
కృష్ణా జిల్లా, కంకిపాడులో ఈదులుగాలులకు పలు హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. పలుచోట్ల కరెంట్ తీగలు తెగి పడటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాల ధాటికి పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ భూములు నీట మునిగినట్లు తెలుస్తోంది.