షాకింగ్; 23 మంది ఎంపీలకు కరోనా…!

-

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇప్పుడు చిగురుటాకులా వణికిస్తుంది. కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ బతుకుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. దీనితో అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఇన్నాళ్ళు భారత్ కి రాని కరోనా ఇప్పుడు భారత్ ని కూడా భయపెడుతుంది. అలాగే గల్ఫ్ దేశాలను కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు అవుతున్నాయి.

ఇరాన్ లో వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 2300 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ సోకిన వారిలో 23 మంది ఎంపీలు ఉన్నారు. 290 మంది ఎంపీల్లో 23 మందికి ఈ వ్యాధి సోకింది. ఇక ఆ దేశ ఉపాధ్యక్షురాలికి కూడా ఈ వ్యాధి సోకడం ఆందోళన కలిగించే అంశం. అలాగే ఉన్నతాధికారులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆ దేశ అధ్యక్షుడు కూడా కరోనా బారిన పడ్డారని అంటున్నారు.

దీనితో ఇప్పుడు ఆ దేశం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. సరిహద్దున ఉన్న దేశాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ వస్తుంది. ఇక మన దేశానికి కరోనా ముప్పు తీవ్రంగా ఉందని అంటున్నారు. ఈ వైరస్ క్రమంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో మన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అటు ప్రజల్లో ఆందోళనలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news