హోలీ వద్దంటున్న మోడీ ..!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్తలు పడుతుంది. ఇప్పటికే హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారి చేసింది. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అందరూ ఆందోళన లేకుండా ఉండాలని, దాని వలన ఇబ్బంది లేదని, మన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని ఆయన పేర్కొన్నారు.

ఇక తాజాగా మోడీ సోషల్ మీడియాలో ఒక సంచలన ట్వీట్ చేసారు. ఈ హోలీ కి తాను దూరంగా ఉంటా అన్నారు. సామూహిక సమావేశాలకు అందరూ దూరంగా ఉండాలని ప్రధాని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. హోలీ ఈ సారి జరుపుకోవద్దని కోరారు మోడీ. అందరూ ఒక్క చోట ఉండవద్దని అన్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామూహికంగా ఉండే హోలీని జరుపుకోవద్దని కోరారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా హోలీకి దూరంగా ఉండాలని అన్నారు. ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ఆస్పత్రికి సిద్దమవుతుంది. దాదాపు 2500 మందికి ఒకేసారి చికిత్స అందించే విధంగా సిద్దమవుతుంది ప్రభుత్వం. ఇప్పటికే దీని కోసం దాదాపు ఆరు వందల కోట్ల నిధులను విడుదల చేసే విధంగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news