కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆటో కోసం కన్న కొడుకును అమ్మేసింది కసాయి తల్లి. ఈ సంఘనట వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్య అనే మహిళకు నర్సింలు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు (ఒక బాబు, పాప) ఉన్నారు.

కొంత కాలం క్రితం నర్సింలు అనారోగ్యంతో మృతి చెందగా, లావణ్య బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మళ్ళ గ్రామానికి చెందిన చాకలి సాయిలతో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది, ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతన్ని వదిలేసి వెళ్ళడంతో కామారెడ్డిలో కూలి పనిచేస్తూ లావణ్యతో సహజీవనం చేస్తున్నాడు.