భారత్-పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే 7న (బుధవారం) మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది కేంద్ర హోం శాఖ. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను సిద్ధం చేసి, రిహార్సల్ జరపాలని సూచనలు చేశారు.

కాగా, 1971 తర్వాత ఇది మొదటిసారిగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహణ చేశారు. ఈ మేరకు మే 7న (బుధవారం) మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్య రాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరమని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం.. కానీ యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్.