డబ్బులు సంపాదించడంతో పాటుగా డబ్బులను ఆదా చేయడం కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే డబ్బులను సరిగ్గా ఉపయోగిస్తారో, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కొంత భాగాన్ని సేవింగ్స్ లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని ఎదుర్కోవడం సులభం అవుతుంది. సహజంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి బడ్జెట్ లేకుండా ఖర్చులు చేస్తూ ఉంటారు. దాని వలన చివరకు సేవింగ్స్ లేకుండా ఉంటాయి. కనుక అవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేసి మిగిలిన ధనాన్ని ముందుగానే సేవింగ్స్ లో చేర్చుకోవాలి. ఇలా చేయడం వలన అనవసరమైన ఖర్చులు పెట్టకుండానే సేవింగ్స్ పెరుగుతాయి.
కొన్నిసార్లు చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి వలన చివరకు ఎటువంటి సేవింగ్స్ ఉండవు. కనుక ప్రతి ఖర్చును కూడా ట్రాక్ చేసుకోవాలి. షాపింగ్ ఖర్చులు, రెస్టారెంట్ ఖర్చులు, గ్రోసరీస్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ వంటి ఇతర ఖర్చులను గమనించి వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వీటితో పాటు, కరెంట్ బిల్లును కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు ఎక్కువ పెరగడం వలన ఖర్చులు అధికమవుతాయి. కనుక ఇంట్లో నుండి బయటకు వెళ్లినప్పుడు లైట్ లు, ఫ్యాన్ లు ఆఫ్ చేయడం, ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వంటివి చేయాలి.
ఇలా చేయడం వలన ఎలక్ట్రిసిటీ బిల్ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా పని మీద బయటకు వెళ్లినప్పుడు అన్ని పనులు ఒకసారి చేసుకోవాలి. ఎక్కువ సార్లు బయటకు వెళ్లి రావడం వలన రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కనుక, సరైన ప్లాన్‌తో బయటకు వెళ్లి అన్ని పనులను పూర్తి చేసుకోవాలి. వీలైనంత వరకు ప్రభుత్వ రవాణాను ఎంపిక చేసుకోవాలి. దీనివలన ఖర్చు తక్కువ అవుతుంది. కనుక, డబ్బును ఆదా చేసుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న మార్పులను తప్పకుండా చేయాలి. కనుక ఇవి పాటించడం వలన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సులభంగా బయటపడవచ్చు.