తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త అందింది. రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక పై కీలక ప్రకటన వెలువడింది. జూన్ రెండో తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కాబోతున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.
దీనికోసం 6000 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. గత గులాబీ పార్టీ ప్రభుత్వ హయాంలో 8.19 లక్షల కోట్లు అప్పులు… మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని గుర్తు చేశారు.