తెలంగాణ సరిహద్దులో పేలిన ల్యాండ్ మైన్.. ముగ్గురు పోలీసులు మృతి

-

దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం చేపడుతున్నారు. లొంగిపోవాలని.. అనవసరంగా ప్రాణాలు కోల్పోకూడదని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొంత మంది మావోయిస్టులు మాత్రం పోలీసులపై దాడులు చేపడుతున్నారు. ఛతీస్ గడ్ కర్రెగుట్టలో ఇటీవల మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాలు మావోయిస్టులను మట్టుపెట్టాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలంగాణ సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్కు చేపట్టారు. ఈ క్రమంలోనే సరిగ్గా అదును చూసి మావోయిస్టులు ల్యాండ్ మైనట్ ని పేల్చగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news