ఐపీఎల్‌కు వీడ్కోలు?.. MS ధోని సంచలన వ్యాఖ్యలు

-

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఒక్క ఐపీఎల్ లో ఆడుతున్నారు. అయితే, గత కొంతకాలంగా ఐపీఎల్‌ను ధోని వీడనున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్-2025 నుంచి చెన్నయ్ సూపర్ సింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో కెప్టెన్ గైక్వాడ్ గాయంతో తప్పుకోగా.. మళ్లీ కెప్టెన్‌గా ధోని పగ్గాలు చేపట్టారు.

ఈ సీజన్ ఓటమికి తనదే బాధ్యత అని అన్నారు. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ తర్వాత ఆయన కెరీర్‌పై ధోని మాట్లాడుతూ.. ‘నాకు 43 ఏళ్ల వయసు. నా కెరీర్ చివరి దశలో ఉందని తెలుసు.ఐపీఎల్-2026లో తిరిగి వస్తానో లేదో త్వరగగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ, అభిమానుల నుంచి లభించిన ప్రేమ, ఆప్యాయత అద్భుతంగా ఉంది.వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపై దృష్టి ఉంది. రాబోయే 6 నుంచి 8 నెలలు కష్టపడి పనిచేశాక బాడీ సహకరిస్తే వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ధోని చెప్పుకొచ్చాడు’ ఆ మాటలతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news