దాయాది పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. భారత్ మీద పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. శనివారం తెల్లవారుజామున ప్రెస్మీట్ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ మీద ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ అనే ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇకమీదట దాడులను పాకిస్తాన్ మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తుండగా.. నిన్న సాయంకాలం చీకటి పాడగానే పాక్ మరోసారి భారత్ మీద సుమారు 100కు పైగా డ్రోన్ దాడులకు పాల్పడింది. వాటిని భారత రక్షణ వ్యవస్థలు చేదించగా.. జమ్ములోని కొన్నిప్రాంతాల్లో డ్రోన్స్ కింద పడి పేలిపోగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.