అమృత్ సర్‌‌లో పాక్ డ్రోన్లు కూల్చివేత.. వీడియో వైరల్

-

భారత్, పాకిస్తాన్ నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుదేశాల నడుమ యుద్ధవాతావరణం నెలకొనడంతో నిన్న సాయంత్రం పాకిస్తాన్ మరోసారి డ్రోన్లతో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. భారత్ లోని 26 ప్రాంతాలను టార్గెట్ చేసుకున్న పాకిస్తాన్ వరుసగా డ్రోన్లతో దాడులకు యత్నించగా.. వాటిని భారత డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుని నేలకూల్చింది.

ఈ క్రమంలోనే పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ – ఖాసా కాంట్ ప్రాంతం మీద ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ నాశనం చేసింది. కాగా, పాకిస్తాన్ కుట్రలను, దాడులను తిప్పికొడతామని ఇండియన్ ఆర్మీ సృష్టం చేసింది. డ్రోన్ శకలాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news