అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్, పాక్ మధ్య యుద్ధం నెలకొన్న తరుణంలో ఎంపీ అసద్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి.
పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు.అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి’ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.