మన యుద్దం పాకిస్తాన్ ప్రజల మీద.. పాకిస్తాన్ మీద కాదు.. టెర్రరిజం పై అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. శనివారం ఆయన సీపీఐ రాస్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బోర్డర్ లో వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి నారాయణ సంతాపం తెలియజేశారు. పాకిస్తాన్ లో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని నారాయణ చెప్పారు. ఇలా కామెంట్ చేసినందుకు పాకిస్తాన్ ఏజెంట్ అంటూ తనపై విరుచుకుపడ్డారని మండిపడ్డారు.
నా ఉద్దేశం అర్థం చేసుకోలేదన్నారు. టర్కీ తప్పితే ఎవ్వరూ పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వడం లేదని.. ప్రపంచం మొత్తం భారత్ కి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఒంటరి అయిపోయిందని.. పాక్ కి చైనా సపోర్ట్ చేస్తుందనేది అపోహ మాత్రమేనని వెల్లడించారు. ఆడపిల్ల కన్నీరు ఊరికే పోదని.. పహల్గామ్ ఉగ్రదాడిలో కాళ్ల పారాణి ఆరకముందే భార్య ముందర భర్తను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా టెర్రరిస్టుల క్యాంపుల పై దాడి చేశారని కొనియాడారు.