ఇండియన్ ఆర్మీ ఇటీవల హతమార్చిన ఉగ్రవాదుల పేర్లు బహిర్గతం అయ్యాయి. పాకిస్తాన్, పీవోకేలోని మొత్తం 9 టెర్రరిస్టు క్యాంపులపై ఈనెల 7న ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత వైమానిక దళం దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అటాక్లో మొత్తం వందకు పైగా టెర్రరిస్టులు హతమయ్యారు.
కాగా, ఈ దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల వివరాలు బహిర్గతం అయ్యాయి. ముదస్సర్ ఖడియన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందల్..లష్కర్-ఎ-తొయిబా. మురిద్కేలోని మర్కజ్ తాయిబా ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. హఫీజ్ ముహమ్మద్ జమీల్.. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది. మౌలానా మసూద్ అజార్ యొక్క పెద్ద అల్లుడు. బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ఇన్చార్జిగా ఉన్నాడు.
మహమ్మద్ యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ మొహద్ సలీం అలియాస్ ఘోసీ సాహబ్ జైష్-ఎ-మొహమ్మద్ చెందిన ఉగ్రవాది. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కర్-ఎ-తొయిబాకు చెందిన ఉగ్రవాది. జమ్మూ కాశ్మీర్‌లో జరిపిన అనేక ఉగ్రవాద దాడులలో పాల్గొన్నాడు.ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌లో కీలకంగా ఉన్నాడు. మొహమ్మద్ హసన్ ఖాన్ జైష్-ఎ-మొహమ్మద్ అనే ఉగ్రవాది పీవోకేలో JeM యొక్క ఆపరేషనల్ కమాండర్ అయిన ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కాశ్మీరి తనయుడు కావడం గమనార్హం.