అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి తల్లితో వారికి ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక తల్లులు కూడా తమ పిల్లలతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. కొందరూ గిప్ట్ లు, శారీలతో సర్ ప్రైజ్ చేస్తుండగా.. మరికొందరూ ఈ ఒక్కరోజు తల్లితో గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మదర్స్ డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు.
ఆయన తల్లితో దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసారు. గమనించిన హిట్ మ్యాన్.. ఆ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు అనూహ్యంగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు ముగింపు పలికారు. రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్ కి గురి చేసాడు. ఈ ఐపీఎల్ కంటే ముందు గత ఏడాది చివరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ తరువాత న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ లు చివరగా రోహిత్ శర్మ ఆడారు.
View this post on Instagram