భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నాం అంటూ కీలక ప్రకటన చేశారు పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి. తాజాగా పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడారు. భారత్ జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. ‘మన దేశం, పౌరులపై భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాం.

భారత్‌లోని 26 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాం. ఢిల్లీ సహా ఇతర నగరాలకు డ్రోన్లు పంపాం. ఫయాజ్, నగ్రోటాలో బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజీ ఫెసిలిటీని ధ్వంసం చేశాం. S-400 క్షిపణి బ్యాటరీలను న్యూట్రలైజ్ చేశాం’ అని తెలిపారు పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి. ఇది ఇలా ఉండగా, భారత్‌పై మరోసారి పాక్ దాడి చేసిందని వార్తలు వస్తున్నాయి. సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి మరోసారి డ్రోన్ దాడులకు పాకిస్థాన్ తెగబడిందని చెబుతున్నారు.