అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు అయింది. ఈ మేరకు ట్రంప్ సర్కార్.ప్రకటించింది. జెనీవాలో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో పురోగతి నెలకొంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి చైనాతో ఒక ఒప్పందానికి వచ్చినట్టు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్లు వెల్లడించారు.

చైనా అధికారులతో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని ప్రకటన చేశారు. అమెరికా చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా భారీ ఎత్తున కంపెనీలు చైనా నుండి భారత్ కు రాబోతున్నాయి అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.