Taraka Rama Rao: నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు కు ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు.నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి నటీనటులను అభినందించారు. ఈ క్రమంలో హీరోకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదకగా విషెస్ తెలిపారు. ‘కీర్తిశేషులు జానకిరామ్ కుమారుడు తారక రామారావు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాతో తారక రామారావు గొప్ప విజయాన్ని అందుకోవాలి’ అని ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.