తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. కారులో చిక్కుకుని ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కారులో చిక్కుకొని ఊపిరాడక ఐదు సంవత్సరాలు చిన్నారి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మక్తమాదారం గ్రామంలో ఆడుకుంటూ ఇంటి ఎదుట నిలిపి ఉన్న కార్లోకి ఎక్కి డోర్ వేసుకుంది చిన్నారి అక్షయ.

ఈ నేపథ్యంలోనే డోర్ లాక్ అయిపోయింది. అనంతరం ఆ డోర్ తీసేందుకు చాలా ప్రయత్నం చేసింది చిన్నారి అక్షయ. ఎంత తీసినా ఆ కారు డోర్ రాలేదు. దీంతో ఊపిరి ఆడ లేక చిన్నారి కార్ లోనే మృతి చెందింది. చాలా సమయం వరకు చిన్నారి అక్షయ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించగా కారులో విగత జీవిగా కనిపించింది చిన్నారి అక్షయ.