జనసేన ప్రత్యేక పూజలు చేస్తోంది. భారత సైన్యం కోసం జనసేన ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు.

ఇది ఇలా ఉండగా ఏపీ పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలో సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇచ్చింది. సరిహద్దుల్లో సేవలు అందించిన రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ పంచాయతీరాజ్ శాఖ. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సుతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.