వేసవికాలంలో వేడి తట్టుకోవడానికి ఎన్నో రకాల పానియాలను తీసుకుంటారు. అయితే సహజమైన పానీయాలను తీసుకోవడం వలన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉండదు. కనుక ఎటువంటి అనుమానం లేకుండా వాటిని తీసుకోవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం వలన శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. దీంతో ఎంతో హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు. అంతేకాకుండా వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కనుక మెరుగైన ఆరోగ్యం కోసం కచ్చితంగా కొబ్బరి నీళ్లను తీసుకోవాలి.
కాకపోతే మధుమేహ సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చా అని చాలా మంది సందేహపడుతూ ఉంటారు. అయితే నిపుణుల ప్రకారం, మధుమేహం సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కొబ్బరి నీళ్లలో సహజంగా ఉండే ఫ్రక్టోస్, గ్లూకోజ్ వంటి చక్కర పదార్థాలు కొద్దిసేపటికి రక్తంలో చక్కర స్థాయిని కొంతవరకు పెంచుతాయి. కాకపోతే ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 6 నుండి 7 గ్రాముల వరకు మాత్రమే సహజమైన చక్కెరలు ఉంటాయి. పైగా దీని గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. అందువలన రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి.
ఎంతో తక్కువ వేగంతో పెరగడం వలన, మధుమేహం సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను కొంచెం మోతాదులో తీసుకోవచ్చు. మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు కొబ్బరి నీళ్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే, రక్తంలోని చక్కర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. కనుక మితంగా తీసుకోవడంలో ఎటువంటి సమస్యలు రావు. ఎప్పుడైతే వ్యాయామం చేసిన తర్వాత శరీరం నుండి నీటిని కోల్పోతారో, అలాంటి సమయంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం వలన శరీరానికి ఎంతో త్వరగా శక్తి అందుతుంది. దీంతో పాటుగా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కనుక, మధుమేహ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను మితంగా తీసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.