మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల విషయంలో క్రిమినల్ కేసుల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని తేల్చింది త్రిసభ్య కమిటీ. ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్టు గుర్తించింది. అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలి ఇచ్చారు.

ఇక అటు ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచింది సిట్. 6 కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జగన్ OSD కుమారుడు రోహిత్ రెడ్డికి చెందిన 6 కంపెనీల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. రాజేంద్రనగర్, ఎస్ఆర్ నగర్, శేరిలింగంపల్లి, మెహిదిపట్నం, గుడిమల్కాపూర్, యాకుత్పురా లో ఉన్న కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకునట్లు సమాచారం అందుతోంది.