ఆపిల్ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిత్యం ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అయితే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాల్లో విషం ఉంటుందని, కనుక ఆ విత్తనాలను పొరపాటున కూడా తినకూడదని చెబుతుంటారు. ఇంతకీ అసలు ఇందులో నిజముందా..? అంతటి ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవా..? వాటిని తినకూడదా..? తింటే ఏమవుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవే. కానీ అవి ప్రాణాంతకం కాదు. వాటిని తినడం వల్ల వికారం, నపుంసకత్వం వంటి సమస్యలు వస్తాయి. కానీ అవి మనుషులను చంపవు. కాకపోతే వాటిని పెద్ద ఎత్తున తీసుకుంటే మాత్రం ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు.
50 కేజీల బరువున్న ఒక వ్యక్తి 165 ఆపిల్ విత్తనాలను తింటే వెంటనే చనిపోతారని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. అంతేకానీ.. ఒకటి, రెండు విత్తనాలను పొరపాటుగా తింటే ఏమీకాదని వారంటున్నారు. అలా అని చెప్పి వాటిని తినకండి. ఎందుకైనా మంచిది. మన ప్రాణాలు ముఖ్యం కదా.. కానీ ఆపిల్ మాత్రం తినండి..!