ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ మంత్రి గారి పేరు అందరికి సుపరిచితమే. మంత్రిగా, ఎమ్మెల్యే గా ఒక వెలుగు వెలిగారు. అయితే తెలంగాణా రాష్ట్ర౦ ఏర్పడిన తర్వాత మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా సరే ఆయనను ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు తెరాస లోకి రండీ అని. ముఖ్యమంత్రే వచ్చి ఆహ్వానించడం తో సరే అన్నారు ఆయన.
వెంటనే తెరాస పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతకి ఆయన ఎవరా అనుకుంటున్నారా…? నిజామాబాద్ జిల్లా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక వెలుగు వెలిగిన నేత. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కెసిఆర్ వెళ్లి ఆహ్వానించడం తో ఆయన జిల్లా పార్టీలో చక్రం తిప్పే అవకాశం ఉందని భావించారు అందరూ.కాని నిజామాబాద్ నుంచి కవిత ఓడిపోయారు.
కారణం ఈయన సరిగా పని చేయకపోవడమే. ఆ విషయాన్ని గ్రహించిన కెసిఆర్ అక్కడి నుంచి మండవ ను పక్కన పెట్టారు. ఆయన వర్గం మొత్తం తెరాస లోకి వచ్చినా కవిత విజయం కోసం పని చేసిన వాడే కరువయ్యారు. దీనితో ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని భావించిన కెసిఆర్ వెనక్కు తగ్గి అదే జిల్లాకు చెందిన ఉమ్మడి ఏపీ స్పీకర్ గా పని చేసిన సురేష్ రెడ్డికి ఇచ్చారు. సురేష్ రెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు.
దీనితో ఇప్పుడు మండవ పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కాలేదు. వాస్తవానికి మండవకు కాంగ్రెస్ లోకి వెళ్ళే ఆఫర్ వచ్చింది., కాని ఆయన తెరాస వైపే మొగ్గు చూపించారు. దీనితో ఇప్పుడు ఆయనకు కెసిఆర్ ఎమ్మెల్సీ అయినా ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఎమ్మెల్సీ పదవులకు చాలా మంది నేతలు పోటీ లో ఉన్నారు. ఈ తరుణంలో మండవ కి ఆ పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి.