ఈ వస్తువులను బహుమతులుగా ఇస్తున్నట్లయితే.. ఆర్థిక సమస్యలు తప్పవు..!

-

సహజంగా ఎన్నో సందర్భాలలో ఇతరులకు బహుమతులు ఇవ్వడం చేస్తూ ఉంటాము. అయితే కొన్ని రకాల బహుమతులను ఇతరులకు ఇవ్వడం వలన మీ మధ్య బంధం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల బహుమతులను ఇతరులకు ఇవ్వడం వలన మీ మధ్య బంధం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తారో, ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో ఎటువంటి సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. అయితే కొన్ని పొరపాట్లు చేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పినటువంటి ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు.

ఇతరులకు నలుపు రంగులో ఉండే వస్తువులను ఇవ్వడం వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. సహజంగా చాలా మందికి నలుపు రంగు అంటే ఇష్టం దాంతో నలుపు రంగులో ఉండే వస్తువులను బహుమతిగా ఇస్తూ ఉంటారు మరియు ఇలా ఇవ్వడం వలన మీ మధ్య బంధం దెబ్బతింటుంది. అలాగే బహుమతులలో పర్సుని కూడా ఇవ్వకూడదు. ఎప్పుడైతే పర్సును ఇతరులకు బహుమానం చేస్తారో, మీ జీవితంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీంతో పాటుగా ఆర్థిక నష్టాలు కూడా ఎదురవుతాయి. కనుక పర్సును అస్సలు బహుమతిగా ఇవ్వకూడదు.

ఇంకా, మంచి సువాసన వచ్చే పెర్ఫ్యూమ్స్‌ ను కూడా బహుమతిగా ఇస్తూ ఉంటారు. అయితే వాటిని బహుమతిగా ఇవ్వడం వలన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జేబు రుమాలను కూడా ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే జేబు రుమాలను బహుమతిగా ఇస్తారో, జీవితం పై ప్రతికూల శక్తి ప్రభావం పడుతుంది. దాంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అదే విధంగా ముత్యాలను కూడా బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సహజంగా, ముత్యాలు ఎంతో అందంగా ఉంటాయి. కానీ, ముత్యాలు కన్నీళ్లకు చిహ్నం. అందువలన వీటిని కూడా బహుమతిగా ఎవరికి ఇవ్వకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news