ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సంఘానికి షాక్ ఇచ్చారు. ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికలను వాయిదా వేస్తున్న సందర్భంగా కొత్త మంది అధికారులను బదిలీ చేసారు. వారిలో ఇద్దరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఉన్నారు. వారిని బదిలీ చెయ్యాలని ఆదేశించినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించడం లేదు. వారిని బదిలీ చేయవద్దనే ఆదేశాలను జగన్ ఇచ్చినట్టు సమాచారం.
వాస్తవానికి ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగ బద్ధ సంస్థ. అయినా సరే జగన్ సర్కార్ మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో… సియేస్ సహా అన్నీ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి. అయినా సరే జగన్ సర్కార్ వెనక్కు తగ్గడం లేదు. ఎన్నికల సంఘంపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు.
దీనితో పలువురు అధికారులను బదిలీ చేయమని ఆదేశాలు ఇచ్చినా సరే జగన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గతంలో సిఎస్ గా ఉన్న వ్యక్తిని మార్చాలని ఆదేశించడం తో… సియేస్ గా 2019 ఎన్నికల సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే అప్పుడు నిఘా విభాగం అధిపతిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ని బదిలీ చెయ్యాలని ఆదేశాలు ఇవ్వడంతో బదిలీ చేసారు.
సిఎస్ నీలం సహానికి కూడా ఇప్పటికే జగన్ ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఏ అధికారిని బదిలీ చేయవద్దని చెప్పారట. దీనితో ఇప్పుడు ఆమె మధ్యలో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఒక పక్క ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా సరే, బదిలీ చేయకపోవడం తో ఎన్నికల సంఘం కోర్ట్ కి వెళ్తే మాత్రం సిఎస్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఎం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.