ఆంధ్రప్రదేశ్లో 15వ ఆర్థిక సంఘం పర్యటన సందర్భంగా గురువారం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను వారికి వివరించారు. ప్రత్యేక హోదాతో పాటూ విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని కేంద్రం విస్మరించిందని.. విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అమలు చేయడలో కేంద్ర విఫలమైందన్నారు. ..కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా…అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నామన్నారు. తొలి ఏడాది ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సాయం, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రాజధానికి రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం తదితర చట్టంలోని 18 అంశాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.