కవితతో బీజేపీకి చెక్ పెడతారా…?

-

నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ పదవి ఇస్తారు అనేది ముందు నుంచి స్పష్టత లేదు. రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని అన్నారు.

కాని రాజ్యసభ సీట్లను మరొకరికి ఇచ్చారు. అయితే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఆ పదవికి గాను ఆమె బుధవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ ఆమె క్రియాశీల రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అయ్యారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆమెను కేబినేట్ లోకి తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

ఇదే జరిగితే.. తెలంగాణలో తొలి మహిళా ఎమ్మెల్సీగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచే ఆమె ఎమ్మెల్సీ గా బరిలోకి దిగుతారని, దాదాపు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్ధిగా విజయ౦ సాధించినట్లే అవుతుంది. కాగా నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే కేఆర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇప్పుడు ఈమెకు ఎమ్మెల్సీ గా అదే జిల్లా నుంచి అవకాశం ఇస్తున్నారు. దీనితో బిజెపి కి చెక్ పెట్టడానికే అంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో ధర్మపురి అరవింద్ దూకుడు గా ఉన్నారు. ఇక బీజేపీ స్థానిక నాయకత్వం కూడా బలంగా ఉంది. వారికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news