BREAKING: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఆర్మీ. ఈ రోజుతో సీజ్ఫైర్ ముగుస్తుందన్న వార్తలను ఖండించారు ఇండియన్ ఆర్మీ. భారత్-పాక్ DGMOల మధ్య ఇవాళ ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని వెల్లడించారు.

కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని స్పష్టం చేశారు. ఈ నెల 12న ఇరు దేశాల DGMOల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ప్రకటన చేశారు. ఇక అటు భారత సైన్యం విషయంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా నిధులు ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేసింది మోడీ ప్రభుత్వం. భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు విషయంలో.. ముందడుగు వేసింది. అత్యవసర సమయాలలో ఆయుధాలు అలాగే డిఫెన్స్ ఎక్కువ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా సైన్యానికి పూర్తిగా అధికారాలు అప్పగించింది మోడీ ప్రభుత్వం.