అగ్ని ప్రమాద బాధితులకు 5 లక్షల రూపాయలు – డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదం లో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన చేశారు.

5 lakh rupees for fire victims said Deputy CM Bhatti

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని వివరించారు బట్టి విక్రమార్క. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news