నేడు స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు సీఎం రేవంత్ రెడ్డి

-

నేడు తెలంగాణాలో కొత్త పథకం ప్రారంభం కానుంది. నేడు స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy to visit his hometown Kondareddypalle today
CM Revanth Reddy to visit his hometown Kondareddypalle today

రూ. 12,600 కోట్ల బడ్జెట్‌తో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది సర్కార్. ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news