Former US President Joe Biden has cancer: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు బిగ్ షాక్ తగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బైడెన్ కార్యాలయం. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బైడెన్‌కు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.

జో బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. “జిల్ మరియు ఆమె కుటుంబానికి మా హృదయపూర్వక మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జో త్వరగా విజయవంతంగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము” అని రిపబ్లికన్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో బైడెన్ భార్య జిల్ బైడెన్‌ను ప్రస్తావిస్తూ అన్నారు.