మహిళ చూపుడు వేలు కొరికేసిన చీటీ నిర్వాహకుడు..!

-

మహిళ చూపుడు వేలు కొరికేశాడు చీటీ నిర్వాహకుడు. దింతో ఊడి మహిళ వేలు కిందపడింది. చిట్టీ డబ్బు విషయంలో ఘర్షణ జరిగి, ఈ ఘ్తన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – మధురానగర్‌లో ఓ మహిళ చూపుడు వేలు కొరికేసాడు చీటీ నిర్వాహకుడు. జవహర్ నగర్‌కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌజ్లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉండగా.. మమత వద్ద చిట్టీలు వేసింది ఇంటి యజమానురాలు సుజిత.

మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉండగా.. ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు ఇప్పించింది. వారం రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది సుప్రియ. చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి, ఆమె భర్త హేమంత్‌తో కలిసి వెళ్ళింది మమత. ఇంటి అద్దె చెల్లించ కుండా సుప్రియ వెళ్లిందని.. అద్దె డబ్బు ఇవ్వాలని పట్టుబట్టింది సుజిత. ఇద్దరి మధ్య మాటామాట పెగడంతో.. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని కొరికేశాడు హేమంత్. దీంతో వేలు పట్టుకుని ఆస్పత్రికి పరుగులు పెట్టింది బాదితురాలు. అతికించలేమని చెప్పారు వైద్యులు. నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news