తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు… స్పాట్ లోనే మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఏకంగా నలుగురు మృతి చెందారు. పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్- హైదరాబాద్ హైవేపై ఆగి ఉన్న లారీని ఓ పెళ్లి బస్సు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో… బస్సులో ఉన్న వారు మృతి చెందారు.

మొత్తం నలుగురు మృతి చెందగా మరో 25 మందికి తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. ఇందులో ఆరుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఈ లారీ – బస్సు ప్రమాదంలో… గాయపడ్డ వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిగి లోని ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.