ఏపీ సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. ఉచితంగానే రూ. 5 లక్షలు!

-

AP Senior Citizen Card 2025:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృద్ధులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం.. కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 70 సంవత్సరాలు నిండిన ప్రతి సీనియర్ సిటిజన్ కు pmjay వయో వందన పథకం కింద ప్రతి సంవత్సరానికి 5 లక్షల ఉచిత వైద్య సేవలు అందించబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది.

AP Pensions

ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ పథకం ద్వారా వృద్ధులకు మేలు జరుగుతుందన్నారు. ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తు చేసుకోవాలని సూచనలు చేశారు. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అటు దివ్యాంగుల సంక్షేమం కోసం యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డులు జారీ చేయబోతున్నట్లు వివరించారు. UDID కార్డు పొందటానికి ఇలాంటి సామాజిక, ఆర్థిక ప్రమాణాలు అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్డులు పొందేందుకు.. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్, గ్రామ సచివాలయం లేదా మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నెల రోజుల్లోపే ఈ సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news