షూటింగ్‌లో హీరోయిన్ రాశి ఖన్నా గాయపడ్డారు. టాలీవుడ్ బ్యూటీ రాశి కన్నా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆనాటి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ఈ భామ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. రాశి కన్నా ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.

కాగా ‘ఫర్జీ-2’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో గాయపడినట్లు హీరోయిన్ రాశి ఖన్నా తెలిపారు. ఈ మేరకు ముఖం, చేతులకు గాయాలైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు.’ అంటూ పోస్టు చే సింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.