వేసవికాలం మొదలయ్యింది అంటే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, దీంతో ఎండను తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల చాలా శాతం మంది ఏసీలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏసీలను సరైన విధంగా ఉపయోగించకపోతే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేడి గాలులతో పాటు ఏసీ పేలుళ్ల సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కనుక వేసవికాలంలో ఏసీలు సురక్షితంగా ఉండాలంటే కొన్ని చర్యలను తీసుకోవాలి. వేసవిలో ఎండలను తట్టుకోలేకపోవడం వలన చాలా మంది టెంపరేచర్ ను చాలా తక్కువగా పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కూలింగ్ వ్యవస్థ సరైన విధంగా పనిచేయాలంటే తగిన టెంపరేచర్ ను మాత్రమే సెట చేయాలి.
అంతేకాకుండా, ఏసీ గదిలో ఉండే ఫర్నిచర్, కర్టెన్ లు లేదా ఇతర వస్తువులు వెంట్ లకు అడ్డు రాకుండా చూసుకోవాలి. ఎయిర్ ఫ్లో తక్కువగా ఉండేటప్పుడు సరైన కూలింగ్ పొందడం కష్టమవుతుంది. ఏసీలో ఉండే ఎయిర్ ఫిల్టర్లు ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటాయి. ఎప్పుడైతే అవి శుభ్రంగా ఉంటాయో, ఎయిర్ ఫ్లో సరైన విధంగా జరుగుతుంది. కనుక ఎయిర్ ఫిల్టర్లను తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. ఏసీ యూనిట్ కూలింగ్ గదికి అవసరమైన పరిమాణంలో ఉండాలి. పెద్దదిగా ఉంటే షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. యూనిట్ కు సంబందించి తరచుగా సమస్యలు ఎదుర్కొకుండా ఉండాలంటే, కూలింగ్ ఏరియాకు తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి.
ఏసీ వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించకపోతే పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏసీ ఫిల్టర్లను శుభ్రపరచడం, భాగాలను సర్వీసింగ్ చేయించడం మరియు వాటి కండిషన్‌ను చెక్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. కూలింగ్ వ్యవస్థ కోసం తగిన టెంపరేచర్ మరియు ప్రోగ్రాం థర్మోస్టాట్‌ను ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా ఏసీలో ఉండే వెంట్స్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ వెంట్స్‌ను నేరుగా కాకుండా సమానంగా అడ్జస్ట్ చేస్తే, గదిలో సమతుల్యమైన కూలింగ్ ఉంటుంది మరియు ఎటువంటి అసౌకర్యం ఉండదు.