ఈ మధ్యకాలంలో జీవన విధానంలో మార్పులు రావడం వలన ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. కాకపోతే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు సాధారణంగా చాలా శాతం మంది కొన్ని రకాల పొరపాట్లు చేస్తుంటారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో, పాలసీ నియమాలను మరియు నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి.
మీరు తీసుకునే పాలసీలు ఎలాంటి అంశాలకు వర్తిస్తాయి అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే పాలసీని కొనుగోలు చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. పెళ్లి తరువాత పాలిసీ ను తీసుకుంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఎంపిక చేసుకోవడం ఎంతో ప్రయోజనం అనే చెప్పవచ్చు. దీని వలన మీతో ఉండే తల్లిదండ్రులు మరియు అత్తమామలు కూడా పాలసీలో సభ్యులుగా మారవచ్చు. ఉమ్మడిగా పాలిసీ ను తీసుకోవడం వలన భీమా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు, అలాగే ట్యాక్స్ మినహాయింపులను కూడా పొందవచ్చు.
ప్రస్తుతం హాస్పిటల్ బిల్లులు చాలా ఎక్కువ అవుతున్నాయి. కనుక, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే ఎక్కువ ప్రీమియం ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వలన ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువగా లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఎటువంటి అనారోగ్యాలకు అది వర్తిస్తుంది అనే అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలి మరియు కొనుగోలు చేసే ముందు నిబంధనలను కచ్చితంగా చదవాలి. దీంతో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు మీ అనారోగ్య సమస్యలను మరియు ఆరోగ్య పరిస్థితిని అస్సలు దాచకూడదు. ఎప్పుడైతే మెడికల్ హిస్టరీని దాచిపెడతారో, భవిష్యత్తులో చికిత్సకు సంబందించిన కవరేజ్ లభించదు. దీని వలన పాలసీ ఉపయోగించలేని పరిస్థితి వస్తుంది.