డబ్బులను చెల్లింపు చేసిన తర్వాత.. హిస్టరీ నుండి హైడ్ చేయడానికే ఈ కొత్త పేటీఎం ఫీచర్..!

-

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ పేమెంట్లు చాలా ఎక్కువ అయ్యాయి అనే చెప్పవచ్చు. దీని కోసం వివిధ అప్లికేషన్లను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఎంతో సులభంగా ఇతరులకు పేమెంట్లను చేస్తున్నారు. అయితే ఈ పేమెంట్లను ఇప్పుడు రహస్యంగా కూడా పంపించవచ్చు. దీనికి సంబంధించి పేటీఎం ఒక అద్భుతమైన ఫీచర్ ను తీసుకురావడం జరిగింది, అదే హైడ్ పేమెంట్ ఆప్షన్. ఈ ఫీచర్ ని ఉపయోగించి మీరు చేసిన చెల్లింపుని హిస్టరీ నుండి హైడ్ చేయవచ్చు. ఇలా చేయడం వలన ఈ చెల్లింపుకు సంబంధించిన వివరాలను ఎవరు చూడలేరు. అయితే ఈ చెల్లింపుకు సంబంధించిన వివరాలు కేవలం అదృశ్యం అవుతాయి, కాకపోతే పూర్తిగా తొలగిపోవు అని పేటీఎం తెలియజేసింది.

అంతేకాకుండా, ఈ విధంగా హైడ్ చేసిన వివరాలను వినియోగదారులు మాత్రమే యాక్సెస్ చేసే విధంగా రూపొందించింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలి అంటే తాజా వెర్షన్ లో పేటీఎం అప్లికేషన్‌ను అప్డేట్ చేసుకోవాలి. తాజాగా విడుదలైన వెర్షన్ లో ఈ హైడ్ పేమెంట్ ఫీచర్ అందుబాటులో ఉంది. యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగానికి వెళ్లాలి. ఈ ఆప్షన్ ను ఓపెన్ చేసిన తర్వాత హైడ్ చెయ్యాలి అని అనుకునేటువంటి పేమెంట్ పై ఎడమ వైపు స్వైప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత హైడ్ మీద క్లిక్ చేయాలి.

ఇక్కడ కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ వచ్చాక, దాని పైన యెస్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత పేమెంట్ హిస్టరీ నుండి మీరు ఎంపిక చేసుకున్న పేమెంట్ వివరాలు కనపడకుండా ఉంటాయి. ఈ విధంగా దాచిన వివరాలను బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగంలో చూడవచ్చు. అక్కడ ఉండేటువంటి మూడు చుక్కలు ఐకాన్ పై క్లిక్ చేసి మెనూ నుండి వ్యూ హిడెన్ పేమెంట్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మొబైల్ పిన్ ఎంటర్ చేయాలి లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు హైడ్ చేసినటువంటి లావాదేవులు కనిపిస్తాయి. అక్కడ తిరిగి స్వైప్ చేయడం ద్వారా అన్ హైడ్ మీద టాప్ చేసి తిరిగి లావాదేవులను పేమెంట్ హిస్టరీ లో కనిపించే విధంగా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news