ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న వాహనదారులకు… ఊరట కలిగించేలా కీలక ప్రకటన చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించిన గ్రీన్ టాక్స్ ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. ఈ నిర్ణయంతో సరకు రవాణా వాహనదారులకు ఆర్థికంగా భారం తగ్గుతుంది.

గత ప్రభుత్వంలో గ్రీన్ టాక్స్ కారణంగా ఏడాదికి 20వేల రూపాయల వరకు పన్ను చెల్లించేవారు వాహనదారులు. అయితే తాజాగా ఆ పన్నును 17 వేల వరకు తగ్గించింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే ఏడాదికి ఇక పైన 1500 నుంచి 3000 రూపాయల వరకు కట్టుకోవచ్చు. కేంద్రం కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించడానికి గ్రీన్ టాక్స్ పెంచే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే గత ప్రభుత్వం ఆ టాక్స్ పెంచింది.