ఏపీ విద్యార్థులకు శుభవార్త..రూ. 15000 జమపై కీలక అప్డేట్ వచ్చింది. స్కూళ్లు తెరిచేలోగా అకౌంట్‌లోకి రూ.15 వేలు అందించనుంది కూటమి సర్కార్. సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ విడుదల చెేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.

ఇక తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15,000 జమ చేస్తామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకే విడతలో ఈ నిధులు జమ చేస్తామన్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న వాహనదారులకు… ఊరట కలిగించేలా కీలక ప్రకటన చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించిన గ్రీన్ టాక్స్ ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. ఈ నిర్ణయంతో సరకు రవాణా వాహనదారులకు ఆర్థికంగా భారం తగ్గుతుంది.