తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయి.

తెలంగాణకు 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. నల్గొండ జిల్లా అప్పాజీపేటలో మహిళా రైతు భిక్షమమ్మ (46), మహబూబాబాద్ జిల్లా ఓతాయిలో గొర్రెల కాపరి చేరాలు (55), గుడెంగలో ప్రవీణ్ కుమార్ (27) అనే వ్యక్తి, వనపర్తి జిల్లా మియాపూర్లో కొరవ నాగరాజు (18) అనే యువకుడు పిడుపాటుకు ప్రాణాలు కోల్పోయారు.