ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ మొదలు అవుతున్నాయి. విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది.

మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితతో పాటు భర్త, పిల్లలకు RTPCR పరీక్షలు చేశారు వైద్యులు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉండాలని సూచించారు వైద్యులు. చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.