చాలా మంది వంటలను చేయడానికి ఎన్నో రకాల పాత్రలను, కుక్కర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పాత్రలను ఉపయోగించడం వలన ఎంతో ప్రమాదం ఎదురవుతుంది. ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్ లో వంటలు అస్సలు చేయకూడదు. సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెజర్ కుక్కర్ కచ్చితంగా ఉంటుంది మరియు ప్రతి రోజు దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్రెజర్ కుక్కర్‌లో కొన్ని రకాల వంటలను అస్సలు చేయకూడదు. ఎప్పుడైతే పాలతో తయారు చేసిన వంటలను ప్రెజర్ కుక్కర్ లో చేస్తారో, పాలు పెరుగు రుచి మారిపోతుంది.
సాధారణంగా బిర్యానీని ప్రెజర్ కుక్కర్‌లో వండుతూ ఉంటారు. ఎప్పుడైతే బిర్యానీ చేయడానికి ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగిస్తారో, దాని రుచి దెబ్బతింటుంది. అంతేకాకుండా డీప్ ఫ్రై చేయడానికి కూడా ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించకపోవడం మేలు.
పకోడీ, వడ వంటి ఇతర డీప్ ఫ్రై వంటలను చేయడానికి ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగిస్తే వేడి ఎక్కువ అవడం వలన కుక్కర్ పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాస్తా లేదా నూడిల్స్ వంటి వాటిని ప్రెజర్ కుక్కర్‌లో వండడం వలన ఓవర్ కుక్ అవుతాయి మరియు దానివలన పోషకాలు కూడా తగ్గిపోతాయి.
ప్రెజర్ కుక్కర్‌లో తక్కువ సమయంలో ఆహార పదార్థాలు ఉడికిపోతాయి. కానీ కుక్కర్ లో బెండకాయ, దొండకాయ వంటి ఇతర కూరగాయలను ఉడికించడం సరైన పద్ధతి కాదు. దీనివలన కూరలు రుచి తగ్గిపోతుంది మరియు పోషకాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా, ప్రెజర్ కుక్కర్‌లో వెన్న, చీజ్ వంటి పదార్థాలను ఉపయోగించి వంటలు తయారు చేయకూడదు. ప్రెజర్ కుక్కర్‌లో ఉండే వేడిని ఇటువంటి పదార్థాలు తట్టుకోలేవు. మసాలా పేస్ట్‌లను ఉపయోగించి వంటకాలను ప్రెజర్ కుక్కర్ లో చేయడం వలన సరైన రుచి రాదు. కనుక మసాలా పేస్ట్‌లను ఉపయోగించి చేసే వంటకాలను నూనెలో బాగా వేయించి, కడాయిలో వండడం మేలు.