ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన వేడి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వేడి కారణంగా చెమటలు కారడం కూడా సహజం. అంతేకాకుండా బయటకు వెళ్లడం కూడా ఎంతో కష్టం అవుతుంది. ఇటువంటి సమయంలో కొన్ని రకాల బట్టలను ధరించడం వల్ల మరింత అసౌకర్యం కలుగుతాయి. ఎండలు పెరిగినప్పుడు ఉక్కపోతను తగ్గించుకోవడానికి, కొన్ని రకాల బట్టలను సరిగ్గా ఎంపిక చేసుకుని బయటకు వెళ్లడం మేలు. సౌకర్యంతో పాటు స్టైలిష్‌గా ఉండే బట్టలను ధరించడం ద్వారా సులభంగా బయటకు వెళ్లి రావచ్చు. సాధారణంగా వేసవి కాలం వచ్చినప్పుడు చాలా శాతం మంది కాటన్ బట్టలను ధరించేందుకు ఇష్టపడతారు.
కాటన్ ఫ్యాబ్రిక్ కు చెమటను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటుంది. కనుక లూజ్‌గా ఉండే కాటన్ బట్టలను ఎంపిక చేయడం ఉత్తమం. చీరలు, టాప్స్, షర్ట్స్, బ్లౌజులు వంటి బట్టలను కాటన్ ఫ్యాబ్రిక్ లో ఎంపిక చేసుకుని ధరించాలి. వేసవి కాలంలో, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. టీషర్ట్స్, స్లీవ్ లెస్ టాప్స్, షార్ట్‌లు వంటి బట్టలను ధరించడం అనుకూలం. పూర్తిగా శరీరాన్ని కవర్ చేసే బట్టలను వేసుకోవడం వలన వేడి మరింత పెరుగుతుంది. కనుక అటువంటి బట్టలను మినహాయించుకోవడం ఉత్తమం.
బట్టల ఫ్యాబ్రిక్‌తో పాటు రంగు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, ముదురు రంగుల బట్టలు ఎండని ఎక్కువ గ్రహిస్తాయి, దీని వలన త్వరగా అలసిపోతారు. కనుక లైట్ కలర్స్, పీచ్ షేడ్స్ వంటి వాటిని ఎంపిక చేయడం చాలా అవసరం. ఎలాంటి ఫ్యాబ్రిక్ బట్టలు వేసుకున్నా, వేసవి కాలంలో కొంచెం లూజ్‌గా ఉండే బట్టలను ధరించడం మేలు. ముఖ్యంగా వేడి కారణంగా దద్దుర్లు, బొబ్బలు, చెమటల వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లూజ్‌గా ఉండే బట్టలను ఎంపిక చేసుకోవడం ఎంతో అవసరం. దీంతో పాటుగా ఎండలో బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ ను అప్లై చేయడం, గొడుగు లేదా కాటన్ స్కార్ఫ్ ఉపయోగించడం చాలా అవసరం. ఈ విధమైన జాగ్రత్తలను పాటించడం ద్వారా ఎండ నుండి కాపాడుకోవచ్చు.